● స్నానాకి వెళ్లి.. నీటమునిగి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లిలో జరిగిన హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొ మురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌కు చెందిన మోతి వాడ్ నాగార్జున(22), గుంటూరు జిల్లా గోగులపాడుకు చెందిన ముండ్ర రత్తయ్య(25) రైల్వేపనుల్లో కూలీలుగా ప నిచేస్తున్నారు. బుధవారం స్నేహితులతో కలిసి హోలీ వే డుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్నానం చేసేందుకు స మీప చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులోనే మునిగి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకుతీసి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగార్జన బంధువు మోతివాడ్ హరిదాస్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.


