హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

Feb 27 2026 9:29 AM | Updated on Feb 27 2026 9:29 AM

హైరిస

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

పెద్దపల్లి/ముత్తారం: పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలానికి చెందిన రామిని రాజేశ్వరి(45) తీవ్రమైన కడుపునొప్పితోపాటు రక్తస్రావంతో బాధపడుతూ పెద్దపల్లి మాతాశిశు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు పలు పరీక్షలు చేసి గర్భకోశంలో సమస్య ఉందని గుర్తించారు. ఆమె బరువు 103 కిలోలు ఉండడంతో ఆపరేషన్‌ కష్టతరమవుతుందని భావించి.. అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్‌ బి.శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ నుంచి రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో సదరు మహిళకు గురువారం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వ హించామని డీసీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. హైరిస్క్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్యు లు, ఆస్పత్రి సూపరింటెడెంట్‌ను కలెక్టర్‌ శ్రీహర్ష అభినందించారు. నిపుణులైన వైద్యులతో ఆపరేషన్‌ చేయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు రాజేశ్వరి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

115 పద్యాలు పాడిన విద్యార్థిని

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పద్యాల పోటీల్లో కందికట్కూర్‌ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థిని నక్క ఆరుష్య 115 పద్యాలు పాడి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరుష్యను మండల విద్యాధికారి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. గతేడాది ఆరుష్య సోదరి శాన్విక 117 పద్యాలు పాడి ప్రథమస్థానంలో నిలిచింది.

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌1
1/2

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌2
2/2

హైరిస్క్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement