సీఎంవో అధికారి అంటూ బెదిరింపులు
బోయినపల్లి(చొప్పదండి): సీఎంవో అధికారినని చెప్పి మిడ్‌మానేరు డీఈఈ రఘుపతికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూర్ ప్రాంతానికి చెందిన రాయబండి సూర్యప్రకాశ్‌ను రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యప్రకాశ్ మొదట రామోజీ ఫిలిమ్ సిటీ సమీపంలోని ప్రైవేట్ సంస్థల్లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. మలక్‌పేట్ ప్రాంతంలో గుర్రపు పందేలపై బెట్టింగ్ అలవాటు ఉండడంతో ఆఫిస్ బాయ్‌గా చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హయత్‌నగర్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్లను దొంగలించగా.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సీఎంవోలో పనిచేస్తానంటూ ప్రభుత్వ అధికారుకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. కొందరు భయపడి అడిగినంత ముట్టజెప్పారు. ఆ డబ్బులను గుర్రపు పందేల బెట్టింగ్‌లో ఖర్చు చేశాడు. ఇలా సూర్యప్రకాశ్‌పై హైదరాబాద్‌లోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, సిసద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో రెండు, జగిత్యాలలో ఒక కేసులో అరెస్ట్ కావడంతో జైలుకి వెళ్లాడు.
మిడ్‌మానేరు డీఈఈకి బెదిరింపులు
ఈనెల 23న సూర్యప్రకాశ్ మిడ్‌మానేరు ప్రాజెక్టు డీఈఈ రఘుపతికి కాల్‌చేసి తాను సీఎంవో ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని డబ్బు డిమాండ్ చేశాడు. రఘుపతి ఎలాంటి డబ్బు ముట్టజెప్పకపోగా.. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సూర్యప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన ఎస్సై రమాకాంత్ దర్యాప్తు ప్రారంభించారు. రఘుపతి నుంచి నేరుగా డబ్బులు తీసుకునేందుకు సూర్యప్రకాశ్ కొదురుపాకకు వస్తుండగా అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సూర్యప్రకాశ్‌ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, బోయినపల్లి ఎస్సై రమాకాంత్, కానిస్టేబుల్ కోటి, అచ్యుత్, వెంకటేశ్, తేజలను ఏఎస్పీ అభినందించారు.
మిడ్‌మానేరు డీఈఈకి బెదిరింపులు
సమాచారం ఇవ్వడంతో పట్టుకున్న పోలీసులు
నిందితునిపై పలు జిల్లాల్లో 10కి పైగా కేసులు
వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి


