బాధితుల వద్దకే పోలీసులు
వీర్నపల్లి(సిరిసిల్ల): పోలీసింగ్ విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ.. బాధితుల కేంద్రంగా సాగే విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ అమలులో వీర్నపల్లి పోలీసులు ఆదర్శంగా నిలిచారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉండడంతో నేరుగా పోలీసులే వారి వద్దకు వెళ్లి కేసు నమోదు చేశారు. వీర్నపల్లి మండలం బావుసింగ్‌నాయక్‌తండాలో భూక్య రాజు, అతని బాబాయి లింగం మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో గురువారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని ఫిర్యాదు స్వీకరించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బావుసింగ్‌నాయక్ తండాలో కేసు నమోదు


