నమో నారసింహాయా | - | Sakshi
Sakshi News home page

నమో నారసింహాయా

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

నమో నారసింహాయా

నమో నారసింహాయా

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో మూడోరోజైన ఆదివారం ఆలయ ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరిలో ఇసుక దిబ్బలపై గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకు స్థానిక ఓల్డ్‌ టీటీడీ కల్యాణ మండపంలో రైస్‌మిల్లర్లు, ఆర్యవైశ్యులు, ఇతర దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. చైర్మన్‌ జక్కు రవీందర్‌ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement