ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్ వాహనం ధ్వంసం
గోదావరిఖని: ట్రాఫిక్‌పోలీస్‌స్టేషన్ ఆవరణలో హోంగార్డ్ ద్విచక్రవాహనం ధ్వంసమైంది. వివరాలు.. గోదావరిఖని సంజయ్‌గాంధీనగర్‌లో ఉంటూ పెద్దపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న దేవరకొండ బ్రహ్మచారి రోజూ బైక్‌పై వచ్చి బస్టాండ్ ముందున్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో వాహనాన్ని పార్కింగ్ చేసి బస్సులో పెద్దపల్లికి వెళ్లి వస్తుంటాడు. అయితే శనివారం బైక్ ముందుభాగం ధ్వంసమై ఉంది. తన వాహనం ద్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ, సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావును వివరణ కోరగా, వాహనం రివర్స్ తీస్తున్న క్రమంలో ద్విచక్రవాహనానికి తాకిందన్నారు. బైక్ డ్యామేజీ అయిందని, దీనిపై విచారణ చేపట్టామన్నారు.


