వికసిత్ భారత్‌లో యువత కీలకం
సప్తగిరికాలనీ(కరీంనగర్): వికసిత్ భారత్– 2047 ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందడంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎస్సారార్ కళాశాలలో ‘50ఏళ్ల అత్యవసర పరిస్థితి నేర్చుకోవలసిన పాఠాలు’ అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి నైపుణ్యమే వికసిత్ భారత్ లక్ష్యమని దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఎన్‌వైకే కో ఆర్టినేటర్ వెంకట రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్స్ నితిన్‌పాఠక్ , టి.రాజయ్య, కడారు సురేందర్‌రెడ్డి, వికసిత్ భారత్ నోడల్ జిల్లా అధికారి ఎలిజబెత్ రాణి, పరీక్షల నియంత్రణాధికారి టి శ్రీనివాస్ పాల్గొన్నారు.


