పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

పిచ్చ

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

బోయినపల్లి(చొప్పదండి): సెలవు రోజు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులతోపాటు, ఒక వ్యక్తిపై పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావుపల్లిలో చిన్నారులు నక్క కావ్య, పిల్లి అపర్ణికలు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా ఓ పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చింది. కావ్య చేతి విరగగా, కన్ను కింద, పెదిమకు గాయమైంది. అపర్ణిక భుజం కింద గాయపర్చింది. అదేదారిలో ఉన్న తీర్థాల కనకయ్య అనే వ్యక్తిపై సైతం దాడి చేయడంతో కాలుకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్‌ ఇరువాలా సంధ్య మహేందర్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు కుక్కను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

గాయపడ్డ అపర్ణిక, కావ్య

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు1
1/1

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement