కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా సీఎం సదస్సుకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి తనవంతుగా భరోసా ఇచ్చారు మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన డివిజన్‌లో ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి రూ.10 వేలు, ఆడపిల్ల పెళ్లికి రూ.25 వేలు అందజేస్తానని రవీందర్ సింగ్ వాగ్ధానం చేశారు. కార్పొరేటర్‌గా విజయం సాధించిన అనంతరం ఆడపిల్ల పెళ్లికి రూ.25 వేలు అందచేశారు. ఈ క్రమంలోనే తన డివిజన్‌లోని జనగామ రాజేశ్వరి దత్తాత్రేయకు మనుమరాలు పుట్టిన విషయం తెలుసుకొన్న రవీందర్ సింగ్ ఆ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం మాజీ కార్పొరేటర్ కమల్‌జిత్ కౌర్ సోహాన్ సింగ్ ఆ కుటుంబానికి రూ.10వేలు నగదు అందజేశారు.
కొత్తపల్లి (కరీంనగర్): అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలక పాత్ర పోషిస్తోందని కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ వి.గంగాధర్ తె లిపారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ లేని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 105 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీ–స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు దోహదపడుతుందని తెలిపారు. విద్యుత్ వెలుగులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని పేర్కొన్నారు.


