కరీంనగర్ అర్బన్: మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన ఆలోచనా ధోరణే కారణం. ఇందులో మొదటిది ఆడ, మగా అనే వివక్ష. కొడుకు, కూతురు మధ్య వివక్షత చూపొద్దు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ సమానమేనని తెలిసేలా పెంచండి. పరిపాలనా పరంగా మహిళలకు అన్ని విషయాల్లో యంత్రాంగం తోడుంటుంది. మహిళలు, పిల్లల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల శారీరక పటిష్టతకు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత ద్వారా తోడ్పాటునిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్, కరీంనగర్


