గుర్తు తెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం

Mar 8 2026 7:32 AM | Updated on Mar 8 2026 7:32 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కలెక్టరేట్‌ రోడ్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిందపడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం కలెక్టరేట్‌ రోడ్‌లో ఓ వ్యక్తి కిందపడిపోగా అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వ్యక్తి వయసు సుమారు 55ఏళ్లకు పైగా ఉంటుందని, గుర్తు పట్టినవారు వన్‌టౌన్‌ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement