పొలాలకు పోయి తెచ్చుకుంటం
నాకు నాలుగు ఆవులు, నాలుగు బర్రెలు ఉన్నయ్. కోతలు పూర్తయినంక పొలాల్లోకి వెళ్లి ఎండుగడ్డి తెచ్చుకుంటం. ఊర్లలో రైతులను అడిగితే తీసుకోమంటరు. ఈసారి ఆ పరిస్థితి లేదు. చైన్ హర్వెస్టర్‌లతో కోసిన వరిగడ్డి చేతికి రాదు. తుక్కు అవుతుంది. పశువులకు వరిగడ్డి కష్టమయ్యేలా ఉంది.
– అయిలి రాజమల్లు, ఖానాపూర్
ఎండుగడ్డి దొరికేలా లేదు
పది పశువులకు ఎండుగడ్డే వేస్త. వర్షాలు, వరదలు ముంచేయడంతో పంటంతా దెబ్బతిన్నది. చైన్ హార్వెస్టర్‌లతో కోస్తే గడ్డిపనికి రాకుండా పోతుంది. రైతులు పొలాల్లోనే కాల్చివేస్తాండ్లు. పశువులు ఉన్నోళ్లు అక్కడక్కడా గడ్డి ఏరుకుని రావాలే. ఈసారి ఎండుగడ్డి దొరికేలా లేదు.
– గుంజే ఓదెలు, ఖానాపూర్
పొలాలకు పోయి తెచ్చుకుంటం


