గోవా టూర్‌కు సూపర్ లగ్జరీ సర్వీసు
కరీంనగర్‌టౌన్: కరీంనగర్–2 డిపో నుంచి గోవా టూర్‌కు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. మార్చి 6వ తేదీన శుక్రవారం సా యంత్రం 4గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరుతుందన్నారు. 7వ తేదీ శనివారం ఉడిపి(కర్ణాటక) వెళ్లి ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ చూసుకొని గోవా చేరుకుంటుందన్నారు. 8వ తేదీన గోవా బీచ్‌లు, ముఖ్య ప్రదేశాలు సందర్శించి అక్కడే బస చేసి 9వ తేదీన సా యంత్రం 4గంటలకు గోవా నుంచి తిరిగి బయల్దేరి, 10వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ. 5,500, పిల్లలకు రూ.4,150 గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్ర యాణికులు 93986 58062, 73828 50708, 89783 83084 ఫోన్ నంబర్లను సంప్రదించి టికెట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.


