వెంటాడుతున్న విషాదం | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న విషాదం

Mar 4 2026 7:26 AM | Updated on Mar 4 2026 7:26 AM

గోదావరిఖని: ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడుతూనే ఉంది . తండ్రితో మొదలైన మృత్యువు.. ఆ తర్వాత పెద్దకొడుకు.. ఇప్పుడు చిన్నకొడు కు భార్గవ్‌(28)నూ కబళించింది. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎంకాలనీ టీటూ–236 క్వార్టర్‌లో నివాసం ఉంటూ ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనిలో పనిచేసిన మిగినబోయిన గణేశ్‌– స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. గణేశ్‌ సింగరేణిలో ఉద్యోగం చేసి గతంలోనే ఉద్యోగ విరమణ చేశాడు. తన స్థానంలో పెద్దకొడుకు అనిల్‌కుమార్‌కు ఉద్యోగం ఇప్పించాడు. కొంతకాలానికి అనారోగ్యంతో గణేశ్‌ చనిపోయాడు. కొంతకాలానికే అనూహ్యంగా జరిగిన గని ప్రమాదంలో అనిల్‌కుమార్‌ కూడా మృతి చెందాడు. దీంతో ఇతడి ఉద్యోగం చిన్నకుమారుడు భార్గవ్‌కు వ చ్చింది. భార్గవ్‌ కొద్దిరోజులుగా డ్యూటీకి సరిగా వె ళ్లక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. రెండేళ్ల నుంచి అండర్‌గ్రౌండ్‌ డ్యూటీ చేయలేక ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ పోషణకు అప్పు చేసి తీర్చలేక మనోవేదనక గురవుతున్నాడు. సోమవారం కుటుంబసభ్యులతో వేములవాడ, కొమురవెల్లి జాతరకూ వెళ్లి వచ్చాడు. తర్వాత తెల్లవారుమున ఇంటి వెనకాల షెడ్డు పైకప్పుకు ఉరేసుకుని మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మొన్న తండ్రి, పెద్ద కుమారుడు.. నిన్న చిన్నకుమారుడు మృతి

ఉరివేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

ఒకేఇంట్లో ముగ్గురి మృతితో తీరని విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement