చిప్పకుర్తిలో యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

చిప్పకుర్తిలో యువకుడి అదృశ్యం

Mar 4 2026 7:26 AM | Updated on Mar 4 2026 7:26 AM

తాట్లవాయిలో కలప పట్టివేత

రామడుగు: రామడుగు మ ండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర సునీల్‌ గౌడ్‌(21) మంగళవారం మ ధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపా రు. కుటుంబసభ్యులకు గ్రా విటీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటాన ని చెప్పి ఇంట్లోంచి వెళ్లినట్లు తెలిపారు. సునీల్‌ గౌడ్‌ సెల్‌ఫోన్‌ కాలువ గట్టుపైన లభ్యమైంది. కాలువలో గ్రామస్తులు గాలించగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తుల తెలిపారు.

మల్యాలలో యువతి..

మల్యాల: మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్‌ శిరీన్‌(26) అదృశ్యమైంది. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన షేక్‌ శిరీన్‌ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈనెల 2న స్కూల్‌కు వెళ్లేందుకు జగిత్యాల బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. కానీ.. స్కూల్‌కు చేరలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి

మానకొండూర్‌: మానకొండూర్‌ మండలం శంషాబాద్‌ గ్రామానికి చెందిన మెరుగు రాయమల్లు(75) బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మెరుగు రాయమల్లు మంగళవారం సాయంత్రం బహిర్భూమికని ఆరుబయటు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్ట నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయమల్లుకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.

రాయికల్‌: మండలంలోని తాట్లవాయి అటవీ ప్రాంతంమీదుగా కలపను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వనసంరక్షణ సమితి చైర్మన్‌ ఆకుల శేఖర్‌, కొండవేని సంజనమధు, సర్పంచ్‌ ఆకుల మల్లేశం, కోసరి మహేశ్‌ కలిసి పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు ఐదు దుంగలను వదిలి పారిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్‌ జిల్లా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రమణారెడ్డిని వివరణ కోరగా.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కలపను స్వాధీనం చేసుకున్నామని, కొంత మంది అనుమానితులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement