సమ్మె బాటలో ఆర్టిజన్లు
శాంతియుతంగా హక్కులు సాధిస్తాం
డిమాండ్లు
● జోరుగా సంతకాల సేకరణ
● ఈనెల 10న హైదరాబాద్ మింట్ కంపౌండ్ ఎదుట భారీ ధర్నా
● అదే రోజు సమ్మె నోటీసు అందించనున్న ఆర్టిజన్లు
రామగుండం: ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 19వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించారు. వివిధ కేటగిరీలలో ఉన్న వారందరినీ రెగ్యులర్ ఉద్యోగుల జాబితాలో చేర్చుతూ 2019 అక్టోబర్ నుంచి రెగ్యులర్ పే స్కేల్స్, పే స్లిప్స్, పెయిడ్ హాలిడేస్ తదితర బెనిఫిట్స్ అమలు చేసినా వీరిని ప్రత్యేక కేటగిరీగానే పరిగణిస్తున్నారు. ఫలితంగా రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చితే వీరికి చెల్లించే జీతభత్యాల్లో భారీ వ్యత్యాసం ఉంది. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఆర్టిజన్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
ఆర్టిజన్ల విధులు
విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, ఫ్యూజ్ ఆఫ్ కాల్ అటెండ్ చేయడం, కొత్త విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు, మీటర్ల ఇన్‌స్టాలేషన్, రీడింగ్ నమోదు చేయడం, బ్రేక్‌డౌన్ సమయంలో పునరుద్ధరణ తదితర పనులు చేయడం. వీరికి ప్రారంభ వేతనం రూ.15 వేల నుంచి గరిష్టంగా రూ.25వేల వరకు ఉంది. ఇందులో టీజీ ట్రాన్స్‌కో 3,769, జెన్‌కో 3,583, ఎస్సీడీసీఎల్ 8,244, ఎన్పీడీసీఎల్ 3,465 మొత్తం 19,061 మంది ఆర్టిజన్లు ఉన్నారు.
ఎనిమిదేళ్లుగా తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వాలను కోరుతున్నా స్పందన కరువైంది. ఈనెల 10న హైదరాబాద్ మింట్ కంపౌండ్‌లోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట తొమ్మిది సంఘాలతో కూడిన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ అసోసియేషన్ జేఏసీ పేరుతో ధర్నా నిర్వహించి సమ్మె నోటీసు అందజేస్తాం. – తూళ్ళ నాగరాజు,
జేఏసీ చైర్మన్, ఉమ్మడి కరీంనగర్
ఆర్టిజన్ కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటి బోర్డు (ఏపీఎస్‌ఈబీ) సర్వీసు రూల్స్ అమలు చేయాలి.
2016కు ముందు అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా గుర్తించని వారందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలి.
టీజీ ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్ కంపెనీల పరిధిలో పని చేస్తున్న అన్‌మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి.
విద్యుత్ సంస్థల్లో మీటర్ రీడర్లు, ఎస్‌పీఎం, పీఏఏ, గార్డెనర్, సెక్యూరిటీ, ఏపీటీఎస్ విజిలెన్స్ తదితర విభాగాల్లో పని చేస్తున్న వారందరికీ జీవో నం.11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలి.
ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, 30 రోజుల పని విధానాన్ని వర్తింపజేయాలి.
సమ్మె బాటలో ఆర్టిజన్లు
సమ్మె బాటలో ఆర్టిజన్లు


