● కొత్తపల్లి పీహెచ్‌సీలో వైద్య పరీక్షల శిబిరం ● జూన్ 12 వరకు కార్యక్రమాల నిర్వహణ
కరీంనగర్: జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజాపాలన ప్రగ తి ప్రణాళిక’ హెల్త్ మిషన్–100 పేరుతో 99 రోజు ల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. శుక్రవారం జిల్లాలోని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. గర్భిణులు, బాలురులు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు, టీకాలు, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్ లతో పాటు ఇతర దీర్ఘకాలిక రోగా ల నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన చికత్సలు, మందులు అందిస్తారు. సంక్రమణ వ్యాధులైన క్షయ, ఎయిడ్స్, నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు పీహెచ్‌సీల్లో హీట్ స్ట్రోక్ నిర్వహణ గదులు ఏర్పాటు చేయనున్నారు. నిపుణులైన వైద్యుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి హెల్త్ మిషన్–100ను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. గైనిక్, పీడియాట్రిక్, అప్తామాలజీ, ఆర్థో, డెంటల్, జనరల్ మెడిసిన్ విభాగా ల నుంచి వైద్యలు హాజరై 30 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో వెంకటరమణ సందర్శించారు. ప్రజలు అందించే ఉచితంగా మందులు ఉపయోగించుకోవాలని, తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. పీవో డాక్టర్ సనజవేరియా, పీహెచ్‌సీ డాక్టర్ నజియా పాల్గొన్నారు.


