యాప్ ఒక్కటే.. సేవలు అనేకం
రామగుండం: ప్రయాణికులకు మరిన్ని నాణ్యమైన సేవలను సత్వరమే అందించేందుకు రైల్వేశాఖ ఆధనిక సాంకేతికతతో కూడిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా అన్నిసేవలు సులభంగా ఒకేయాప్‌ద్వారా అందుతాయి. ఇప్పటివరకు వివిధ రకాల(సాధారణ, రిజర్వేషన్, తత్కాల్)టికెట్ల జారీకి వినియోగిస్తున్న అన్‌రిజర్వుడ్ టికెట్ ఇష్యూయింగ్ సిస్టం (యూటీఎస్)ను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అదేస్థానంలో ఒకేయాప్‌ను మార్చి ఒకటో తేదీనుంచి అమలులోకి తీసుకొన్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ఉన్న ప్రతీ ప్రయాణికుడు సత్వరమే రేల్‌వన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
● రిజర్వుడ్, అన్ రిజర్వుడ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు
● డిజిటల్ పేమెంట్‌ల ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్లపై 3శాతం డిస్కౌంట్
● లైవ్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టంతో రైలు ప్రస్తుత స్థానం, చేరుకునే ప్లాట్‌ఫామ్ నంబరు, జాప్యం, కోచ్ పొజిషన్, రియల్ టైమ్ అప్‌డేట్
● పీఎన్‌ఆర్ స్టేటస్ చెక్ విధానం ద్వారా టికెట్ కన్ఫర్మేషన్, బుకింగ్
● టికెట్లను రద్దు చేసుకోవడం ద్వారా డబ్బులు తిరిగి పొందే వీలు
● రాబోయే స్టేషన్‌లో నేరుగా సీటు వద్దకు భోజనం తెప్పించుకునేలా ఆర్డర్ చేసుకునే సౌకర్యం
● ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలపై ఇదేయాప్ ద్వారా ఫిర్యాదు చేసేవీలుంది.
ఒకటి నుంచి రేల్‌వన్ యాప్ సేవలు


