రాజకీయాలకతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరంలోని 9,10,11 డివిజన్లలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10వ డివిజన్‌ కట్టరాంపూర్‌లో గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం మైదానం వద్ద కార్పొరేటర్‌ సౌగాని కొమురయ్యతో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న గేట్‌ నిర్మాణానికి, 9వ డివిజన్‌ కట్టరాంపూర్‌ శివారుకాలనీలో కార్పొరేటర్‌ పడిశెట్టి వసంతలక్ష్మితో కలిసి రూ.2.50 లక్షలతో డ్రైనేజీ కల్వర్టు నిర్మాణ పనులకు, ఉజ్వల పార్కు సమీపంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.5 లక్షలతో గంగపుత్ర సంఘం కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. 11 వ డివిజన్‌లో కార్పొరేటర్‌ ఆకుల నర్మదతో కలిసి న్యూ శ్రీనగర్‌కాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. మేయర్‌ మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా నగరంలోని అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామన్నా రు. మేయర్‌ వెంట సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేరట్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement