కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలోనే కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా మార్చేందుకు కృషి చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు శనివారం నగరపాలకసంస్థ పరిధిలోని 3,4,5,6,7 డివిజన్‌లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3వ డివిజన్ విద్యారణ్యపురిలో కార్పొరేటర్ సాదినేని లావణ్య మునీందర్‌తో కలిసి మేయర్ డివిజన్‌లో పారిశుధ్య పనులు నిర్వహించారు. రూ.5 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4వ డివిజన్ దుర్శేడ్ లో కార్పొరేటర్ భూపతి రవీందర్‌తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టారు. రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో వసతి సదుపాయాల కోసం రూ.10 లక్షలు కేటాయించారు. 5వ డివిజన్‌లో కార్పొరేటర్ గాదె రూపతో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 6వ డివిజన్ గుంటూరుపల్లిలో కార్పొరేటర్ మ్యాకల వెంకటేశ్‌తో కలిసి రూ.5 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 7వ డివిజన్ సదాశివపల్లిలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్‌తో కలిసి రూ.9 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్తాపన చేశారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్‌ఈ రాజ్ కుమార్, రైల్వే బోర్డు సభ్యుడు పాశం తిరుపతి, దాది సుధాకర్ పటేల్, పుట్టపాక శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


