కోనరావుపేట(వేములవాడ): ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడిచేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిజామాబాద్‌లో బుధవారం కాలువ పనులను ఉపాధిహామీ కూలీలు చేస్తున్నారు. హఠాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో పులి పాలవ్వ, అంగూరి రాములు, సలీం, సింగం రాజమణి, జక్కుల భూమయ్య, కవ్వంపెల్లి నర్సవ్వ, తాళ్లపెల్లి నర్సయ్య, తాళ్లపెల్లి దేవవ్వ గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పాలవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన కూలీలను ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మాజీ జెడ్పీటీసీ బండ నర్సయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, ఏపీవో శ్రీనివాస్, డీసీసీ మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ పరామర్శించారు.
8 మందికి గాయాలు


