సీఎం కప్ పోటీలు గ్రామీణ ప్రతిభకు అద్భుత వేదికగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు కష్టపడి సాధించిన పతకాలు జిల్లా క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. భవిష్యత్తులో మరింత మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
– వి.శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్‌వో, కరీంనగర్
సీఎం కప్ ద్వారా ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. జిల్లా సాధించిన పతకాలు ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం. క్రీడాకారుల క్రమశిక్షణ, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ ఫలితాలు అందించాయి.
– రవికుమార్, డీవైఎస్‌వో, జగిత్యాల
గ్రామీణ యువతలో అపారమైన ప్రతిభ ఉంది. సరైన ప్రోత్సాహం లభిస్తే వారు అద్భుతాలు చేయగలరని సీఎం కప్ పోటీలు మరోసారి నిరూపించాయి. ఈ విజయాలను నిలబెట్టుకునేలా నిరంతర ప్రోత్సాహం అందిస్తాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు రాష్ట్ర స్థాయిలో మెరవడం గర్వకారణం.
– ఎ.సురేశ్‌కుమార్, డీవైఎస్‌వో, పెద్దపల్లి
పతకం సాధించడం ఆనందంగా ఉంది. సీఎం కప్ పోటీలు మంచి అనుభవాన్నిచ్చాయి. ప్రతిసారి సాధనలో మరింత మెరుగుపడాలని నేర్చుకున్నా. ఇకపై జాతీయ స్థాయిలో రాణించడం లక్ష్యం. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తా.
– డి.వైష్ణవి, బంగారు పతక విజేత


