‘నారోజు’కు మహిళా కీర్తిరత్న పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘నారోజు’కు మహిళా కీర్తిరత్న పురస్కారం

Mar 5 2026 7:39 AM | Updated on Mar 5 2026 7:39 AM

● హాజరుశాతం తక్కువ ఉందని అభ్యంతరం

కరీంనగర్‌ కల్చరల్‌: అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ శ్రీశ్రీ కళావేదిక, సవ్యసాచి గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో కరీంనగర్‌ చెందిన కవయిత్రి, గానకోకిల నారోజు వెంకటరమణకు ‘మహిళ కీర్తి రత్న’ పురస్కారం అందించారు. బుధవారం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో గల సర్వోత్తమ గ్రంథాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకల్లో సంస్థ బాధ్యులు కత్తిమండ ప్రతాప్‌కుమార్‌, కత్తిమండ ప్రతాప్‌ కుమార్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ఎల్‌ఎల్‌ఎం ఇంటర్నల్స్‌కు అనుమతి నిరాకరణ

కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం ద్వితీయ ఇటర్నల్‌ పరీక్షకు విద్యార్థులను అనుమతించలేదు. హాజరుశాతం తక్కువ ఉందని రిజిస్ట్రార్‌ పి.సతీశ్‌కుమార్‌ నిరాకరించారు. సాయంత్రం వరకు బ్రతిమిలాడినా వినలేదని విద్యార్థులు చెబుతున్నారు. తాము ఎల్‌ఎల్‌బీలో ప్రాక్టీసు చేస్తూ ఎల్‌ఎల్‌ఎం తరగతులకు హాజరవుతున్నామని, 75శాతం హాజరు నిబంధన నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు. 17 మందిలో ఒకరిద్దరికి 60శాతం ఉందని, మిగతావారికి 30 నుంచి 40 శాతం హాజరు ఉందని, 75శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు పేర్కొంటున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో అసలు పరీక్షలు ఉంటాయా? వాయిదా వేశారా అర్థం కాకుండా పోయిందని అనుమానం వ్యక్తం చేశారు. యూ నివర్సిటీ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అడ్మిషన్ల సమయంలో వెలుసుబాటు కల్పించి, పరీక్షల సమయంలో ఇలా చేయడం సరికాదన్నారు. నిబంధనల మే రకు హాజరుశాతం ఉంటేనే అనుమతిస్తామని అధికారులు ఖరాకండిగా చెప్పడంతో విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. గతంలో పరీక్షలు వాయిదా పడినప్పుడు 60 శాతం పైగా తరగతులకు హజరవుతామని వి ద్యార్థులు హమీ ఇచ్చారని, అందుకే అను మతించలేదని వర్సిటీ అధికారులు తెలిపారు.

7న ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అకడమిక్‌ హైట్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్స్‌ మెన్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. రాణించిన క్రీడాకారులను ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 11 గంటలకు సంయుక్త కార్యదర్శి ప్రభాకర్‌కు రిపోర్ట్‌ చేయాలని, 9441925807 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు వెల్లడించారు.

8న మహిళలకు ఆటల పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేరా యువభారత్‌, జిల్లా యువజన క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో బాలికలకు, మహిళలకు అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించనున్నట్లు మై భారత్‌ జిల్లా అధికారి ఎం.వెంకట రాంబాబు తెలిపారు. 100, 200, 400 మీటర్ల రన్నింగ్‌ను అండర్‌–13, 18, 18 విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 8న ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని, వివరాలకు 89771 48872 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,550

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం క్వింటాల్‌ పత్తి రూ. 7,550 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement