రేపు కొండగట్టు ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

రేపు కొండగట్టు ఆలయం మూసివేత

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

రేపు కొండగట్టు ఆలయం మూసివేత

రేపు కొండగట్టు ఆలయం మూసివేత

మల్యాల: రాహుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఈ నెల 3న ఉదయం 7.30గంటలకు స్వామివారి నివేదన అనంతరం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రగ్రహణం అనంతరం మంగళవారం రాత్రి ఏడు గంటలకు పుణ్యహచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన నిర్వహించి స్వామివారి సర్వదర్శనం, ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభిస్తామని వివరించారు.

బైక్‌పై నుంచి పడి రైతు మృతి

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన రైతు పోకతోట భూమయ్య(65 ) ప్రమాదవశాత్తు బైక్‌ పై నుంచి పడి మృతిచెందిన ట్లు ఎస్సై రవికిరణ్‌ తెలిపా రు. పోలీసుల కథనం ప్రకారం.. భూమయ్య శనివారం సాయంత్రం చేను వద్దకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నాడు. గ్రామశివారులో బైక్‌ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడ ు. భూమయ్యకు భార్య ఎంకవ్వ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎంకవ్వ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

కుంటలో పడి రైతు..

వీణవంక: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల రాజేశ్‌(35) ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయాడు. తనకున్న 30గుంటల భూమిలో వరి వేశాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి గత నెల 28న సాయంత్రం వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో శవమై కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. పొలం పనులు చూసుకొని వస్తుండగా కుంట వద్దకు రాగానే కాలుజారి పడిపోవడంతో మృతి చెందినట్లు మృతిడి భార్య రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచ్‌ మండల కుమార్‌, ఉపసర్పంచ్‌ రవీందర్‌ రూ.5వేల చొప్పున అందించారు.

ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్య

వేములవాడరూరల్‌: వేములవాడరూరల్‌ మండలం నమిలిగుండుపల్లికి చెందిన సిందం రాజయ్య (60) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజయ్యకు 2023లో గుండె సంబంధిత సర్జరీ కాగా, అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుండే వాడు. మనస్తాపానికి గురై జీవితంపై విరక్తిచెంది ఆదివారం తన ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్‌ ఎస్సై వెంకట్రాజం తెలిపారు.

అడవిపందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్‌

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో విద్యుత్‌ వైర్లు అమర్చి అడవిపందిని చంపిన పల్లపు నర్సయ్యను అదుపులోకి తీసుకున్నటు్‌ల్‌ ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు. ఆదివారం ఉదయం వెంకటయ్య ద్విచక్రవాహనంపై అడవిపంది కళేబరాన్ని తరలిస్తుండగా, పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం అటవీ శాఖాధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

కేసు నమోదు

వీర్నపల్లి: మండలంలోని సీతారాంనాయక్‌ తండా పంచాయతీ పరిధిలోని పొలాల్లోకి పశువుల కాపరి గేదెలను మేతకు తీసుకెళ్లాడు. అడవిపందుల కోసం దుండగులు అమర్చిన నాటు బాంబును ఆహారంగా భావించి గేదె నోట్లో పెట్టుకోగా ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబు పేలడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎస్సై వేముల లక్ష్మణ్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. వన్యప్రాణుల వేట కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నాటు బాంబులను అమర్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు అవాస్తవం

ఎస్‌.ఎన్‌ మాల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ శ్రీధర్‌రెడ్డి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పోలీసులు, ఎస్‌.ఎన్‌. మాల్‌ సంస్థపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, ఏమాత్రం నిజం లేదని ఎస్‌.ఎన్‌ మాల్‌, శ్రీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్‌.ఎన్‌ మాల్‌ అనుమతి ఎన్‌వోసీ కోసం కరీంనగర్‌ సీపీ రూ.25 లక్షలు వసూలు చేశారన్న మాట్లల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులకు ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. ప్రబుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్న తరువాతే మాల్‌ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఎస్‌ఎన్‌ మాల్‌ త్రీటౌన్‌ పరిధిలో ఉందని అప్పుడు సీఐ జాన్‌రెడ్డి ఉన్నారని, ఈ విషయంలో కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, సీఐ సృజన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై, ఏళ్ల తరబడి వ్యాపారరంగంలో ఉన్న తమలాంటి సంస్థలపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement