సభ్యత్వమంటే సంఘానికి పునాది రాళ్లు | - | Sakshi
Sakshi News home page

సభ్యత్వమంటే సంఘానికి పునాది రాళ్లు

Mar 6 2026 8:19 AM | Updated on Mar 6 2026 8:19 AM

● టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి

● టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి

కరీంనగర్‌ అర్బన్‌: సభ్యత్వమంటే డబ్బులు కాదని, సంఘానికి పునాది రాళ్లని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ, పశుసంవర్ధక, జిల్లా ట్రెజరీ శాఖల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా.. ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనలో తెలంగాణ ఎన్జీవో సంఘం ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగులను సమీకరించడమంటే ప్రశ్నించే పోరాట యోధులను ఒకే వేదిక పైకి తీసుకురావడమని అన్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ నల్ల లింగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డీడీ నాగరాజు, టీఎన్జీవోల జిల్లా నాయకులు సంగెం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్‌కుమార్‌, సర్దార్‌ అరవింద్‌సింగ్‌, గూడ ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వరరావు, గిరిధర్‌రావు, కమలాకర్‌, గోవిందపతి శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, ఉద్యోగులు రాజేశ్‌, హైమావతి, హరిప్రియ, జగన్‌గౌడ్‌, విజయలక్ష్మి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement