పలకరిస్తూ.. ఆరా తీస్తూ
అక్కడో చింత, వేప చెట్టుండే..!
ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన వేణుగోపాల్‌రావు అటు, ఇటు కలియతిరిగారు. తనను కలిసేందుకు వచ్చిన కాలనీవాసులతో అక్కడ ఓ చింత చెట్టు.. ఇక్కడో వేప చెట్టు ఉండే.. రోజు పొద్దున్నే చెట్టు కిందున్న బండపై కూర్చునేదని పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు కాలానికి తగ్గట్టు అంతా మారిపోయాయని పలువురు కాలనీవాసులు పేర్కొన్నారు.
శాంతమ్మ నన్ను బడికి తీసుకుపోయేది
మల్లోజుల వేణు ఇంటికి చేరాడనే సమాచారం తెలుసుకున్న పలువురు అతడిని కలుసుకున్నారు. కొందరి పేర్లను గుర్తుంచుకుని పలకరించిన వేణు ఇంకొందరిని పరిచయం చేసుకుని వారితో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పుడు శాంతమ్మ తనను సీతారామస్వామి గుడి దగ్గర ఉన్న బడికి తీసుకపోయేది అంటూ గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుల్లో కొందరు చనిపోయారని తెలుసుకుని బాధపడ్డారు.
పోలీసు బృందం పర్యవేక్షణలో..
ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ, ఎనిమిది మంది పోలీసు అధికారుల బృందంతో వేణుగోపాల్‌రా వు దంపతులు పెద్దపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. స మాచారం అందుకున్న పాత్రికేయులు ఫొటో, వీడియోలు తీసేందుకు యత్నించగా పోలీసు అధికారులు వద్దని వారించారు. వారి సూచన మేరకు వేణుగోపాల్‌రావు కూడా ‘ఇప్పుడేమీ వద్దు.. కేవలం కుటుంబసభ్యులను మాత్రమే క లిసేందుకు వచ్చా..మళ్లీ వచ్చేనెలలో వస్తా.. అప్పు డు అన్ని విషయాలు మాట్లాకుందాం’..అని పేర్కొన్నారు.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానికులతో మాట్లాడుతున్న వేణుగోపాల్‌రావు
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్న మావోయిస్టు మాజీ అగ్రనేత ‘మల్లోజుల’
45 ఏళ్ల తర్వాత సొంతింటికి వేణుగోపాల్‌రావు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: ‘అరెయ్.. భాస్కర్ ఎలా ఉన్నావ్.. మనోళ్లంత ఎక్కడెక్కడున్నారు.. ఎలా ఉన్నారు.. భగవాన్‌సింగ్ బాగున్నవా’.. అంటూ మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు తన చిన్ననాటి మిత్రులను ఆలింగనం చేసుకుని ఆత్మీయత పంచుకున్నారు. కాలనీవాసులను కలుసుకుని భావోద్వేగానికి లోనై తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన 27వ ఏట రాడికల్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఇల్లు విడిచి వెళ్లిన వేణుగోపాల్‌రావు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీలో కీలక పదవుల్లో కొనసాగిన విషయం విదితమే. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట తన భార్య తారతో లొంగిపోయిన వేణుగోపాల్‌రావు దంపతులు 45 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరుకున్నాడు. పెద్దన్న ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి.. కుటుంబీకులు, బంధువులతో ముచ్చటించారు.
పలకరిస్తూ.. ఆరా తీస్తూ


