ఆదర్శంగా నగరం
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్‌టౌన్:
కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 51వ డివిజన్ వావిలాలపల్లిలో రూ.16 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నుంచి బండారి వేణును భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నగరాన్ని అభివృద్ధి పరుస్తామని వెల్లడించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్ వంగల పవన్, వొంటెల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రికి కేంద్రం నిధులే ఊపిరి
జిల్లా ప్రభుత్వాసుపత్రికి కేంద్ర నిధులే ఊపిరిగా నిలుస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఏడాదికి సగటున రూ.50 నుంచి 70 కోట్ల వరకు కేంద్ర నిధులు ఈ ఆ సుపత్రికి అందుతున్నాయన్నారు. సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ నవీన పాల్గొన్నారు.
బంజారాల అభ్యున్నతికి కృషి
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అన్ని తరాలకు ఆదర్శనీయుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బంజారా సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆర్డీవో మహేశ్వర్, గుగులోతు తిరుపతి నాయక్, భూక్య తిరుపతి నాయక్, రాజు నాయక్, రాందాస్ నాయక్, భీమా సాహెబ్, లావుడ్య కిషన్‌నాయక్, రాజు నాయక్, శ్రావణ్ నాయక్, ధరావత్ పాల్గొన్నారు.


