నాటుబాంబు పేలి గేదెకు తీవ్ర గాయాలు
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో శనివారం ఓ పొలంలో నాటుబాంబు పేలి పాడిగేదె తీవ్రంగా గాయపడింది. అడవి జంతువుల వేటకోసమే గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో అమర్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని సీతారాంనాయక్ తండాకు చెందిన శ్రీనివాస్ పాడిగేదె శనివారం మేత కోసం పొలానికి వెళ్లింది. ఈక్రమంలోనే ఆ పొలంలో అడవి జంతువుల కోసం అమర్చిన నాటుబాంబును నోటితో కొరకడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి గేదె నోటి భాగం ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.


