వికసిత్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్‌స్పోర్ట్స్: వికసిత్ భారత్ జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్–2026 పోటీల వాల్‌పోస్టర్‌ను గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో ఆవిష్కరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి, ఎమర్జెన్సీపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను వ్యక్తపరచాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలను 18 నుంచి 25ఏళ్ల వయసు గల యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం స్పోర్ట్స్ అకాడమీ క్రీడాజెర్సీలు ఆవిష్కరించారు. ఎన్‌వైకే కో ఆర్డినేటర్ రాంబాబు, ఎస్సారార్ కళాశాల ప్రి న్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్ష రాసి.. తండ్రి చితికి నిప్పుపెట్టి
కరీంనగర్‌టౌన్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన బండమీది అభి నగరంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ద్వితీ య సంవత్సరం చదువుతున్నాడు. అభి తండ్రి లక్ష్మయ్య గురువారం వేకువజామున గుండెపోటుతో చనిపోయాడు. తండ్రి మరణించిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న అభి ఇంటర్ పరీక్షలు రాసేందుకు వచ్చాడు. నగరంలోని శ్రేయ ఒకేషనల్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసి.. తిరిగి వెళ్లి మధ్యాహ్నం తండ్రి చితికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందజేత
చిగురుమామిడి: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ అందిస్తున్న స్టడీ మెటీరియల్ ఎంతగా నో ఉపయోగపడుతుందని బొమ్మనపల్లి సర్పంచ్ కొంకట మౌనిక అన్నారు. గురువారం బొమ్మనపల్లి జిల్లాపరిషత్ పాఠశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను హెచ్‌ఎం లక్ష్మణ్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. సాక్షి సిబ్బంది కత్తుల మొండయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
28న పౌరహక్కుల దినోత్సవం
కరీంనగర్‌టౌన్: ఈ నెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించే పౌరహక్కుల దినోత్సవంలో ప్రజ లు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నాగైలేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కరీంనగర్‌రూరల్‌లో చామనపల్లి, మానకొండూర్‌లో బంజేరుపల్లి, తిమ్మాపూర్‌లో వచ్చునూర్, గన్నేరువరంలో మైలారం, గంగాధర, రామడుగులో దేశ్‌రాజ్‌పల్లి, చొప్పదండిలో సాంబయ్యపల్లి, చిగురుమామిడిలో గాగిరెడ్డిపల్లి, వీణవంకలో మల్లారెడ్డిపల్లి, సైదాపూర్‌లో గర్రెపల్లి, శంకరపట్నంలో అంబేద్కర్‌నగర్, జూరాబాద్‌లో రాంపూర్, జమ్మికుంటలో సైదా బాద్, ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామాల్లో జరిగే పౌరహక్కులు దినోత్సవంలో రెవెన్యూ, పోలీసు, సంక్షేమశాఖ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.
6,7న పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఎస్‌యూ పరిధి లోని తెలుగు విభాగంలో మార్చి 6, 7న పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకుడు మహమ్మద్ జాఫర్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి విభాగాధిపతి కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
వికసిత్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ
వికసిత్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ


