యూరియా బ్లాక్ దందా
ద్విచక్రవాహనంపై యూరియా బస్తాలు తీసుకెళ్తున్న ఈ రైతుది మానకొండూరు మండలం గంగిపల్లి. గురువారం మొబైల్‌లో ఫర్టిలైజర్ యాప్‌లో సహకార సంఘాల విక్రయ కేంద్రాల్లో యూరియా స్టాక్ లేకపోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంలో మూడు బస్తాలు బుక్ చేసి తీసుకునేందుకు వచ్చాడు. దుకాణ యజమాని బస్తాకు రూ.300 చెప్పడంతో మూడు బస్తాలకు రూ.900 చెల్లించాడు. దుకాణ యజమాని మాత్రం ఒక్కో బస్తాకు రూ.266 చొప్పున రశీదు ఇవ్వడం గమనార్హం. ఆన్‌లైన్‌లో యూరియా బస్తాకు రూ.300 అనుకుని చెల్లించానని, రశీదులో మాత్రం రూ.266 బిల్లును దుకాణయజమాని ఇచ్చాడని సదరు రైతు తెలిపాడు. ఈ పరిస్థితి ఒక్కరైతుది మాత్రమే కాదు.. ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్న రైతులందరు వ్యాపారుల దోపిడీకి బలవుతున్నారు.


