ఆశల పంట.. నష్టాల మూట..! | - | Sakshi
Sakshi News home page

ఆశల పంట.. నష్టాల మూట..!

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

ఆశల పంట.. నష్టాల మూట..!

ఆశల పంట.. నష్టాల మూట..!

● శనగ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ● కోల్డ్‌ స్టోరేజీలో 10 లక్షల క్వింటాల శనగలు ● శనగ రైతును దగా చేస్తున్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ● విదేశీ సుంకం తగ్గించి రైతుపై పోటు ● శనగ రైతును పట్టించుకోని సీఎం చంద్రబాబు ● వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కేంద్రంతో పోరాడి దిగుమతి సుంకం పెంపునకు కృషి ● ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 70 వేల ఎకరాలకు సాగు పరిమితం ● గత సంవత్సరం ధర లేకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీలో మూలుగుతున్న వైనం

● శనగ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ● కోల్డ్‌ స్టోరేజీలో 10 లక్షల క్వింటాల శనగలు ● శనగ రైతును దగా చేస్తున్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ● విదేశీ సుంకం తగ్గించి రైతుపై పోటు ● శనగ రైతును పట్టించుకోని సీఎం చంద్రబాబు ● వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కేంద్రంతో పోరాడి దిగుమతి సుంకం పెంపునకు కృషి ● ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 70 వేల ఎకరాలకు సాగు పరిమితం ● గత సంవత్సరం ధర లేకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీలో మూలుగుతున్న వైనం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

మ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి సంవత్సరం 1.50 లక్షల ఎకరాలకుపైగా శనగ సాగు చేస్తారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల వరకూ సాగు చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత శనగ సాగు ఏడాదికేడాదికి దిగనాశిగా తయారవుతోంది. గత సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ సంవత్సరం కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో శనగ పంట మరో నెల రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.

10 లక్షల క్వింటాలు కోల్డ్‌ స్టోరేజీల్లో...

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రెండేళ్లుగా శనగ నిల్వలు కోల్డ్‌ స్టోరేజీల్లో మూలుగుతున్నాయి. 50 వేల మందికిపైగా రైతులు తమ శనగ నిల్వలను కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించాయి. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవటంతో నష్టాలకు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక శనగ రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒంగోలుతో పాటు సంతనూతలపాడు, కొండపి, అద్దంకి, దర్శి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్‌ స్టోరేజీలలో పది లక్షల క్వింటాల పాత శనగలు మగ్గుతున్నాయి. వీటికి అద్దెలు కూడా కట్టలేని స్థితిలో రైతులు ఉన్నారు.

మద్దతు ధర కూడా లేక అవస్థలు...

ఆరుగాలం రైతులు పండించిన శనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5650 కూడా లేకపోవటంతో రైతుల బాధలు వర్ణణాతీతం. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల లోపే కొనుగోలు చేసే పరిస్థితులు ఉండడంతో ఖర్చులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు సంవత్సరాల్లో రైతులు పండించిన శనగ పంటను కొంత మేర తెగనమ్ముకున్నారు. ఎందుకంటే కూలీలకు, మందులకు పెట్టిన పెట్టుబడులు అయినా చెల్లించాల్సి ఉంది కాబట్టి ఇచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో దిగుమతి సుంకం పెంచేందుకు పోరాటం...

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విదేశాల నుంచి దిగుమతయ్యే శనగలపై సుంకాన్ని పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య శాఖామంత్రుల చుట్టూ తిరిగి లేఖలమీద లేఖలు రాసి దిగుమతి సుంకం 30 శాతం నుంచి 60 శాతానికి తీసుకెళ్లారు. దాంతో దేశీయంగా శనగ పండించిన రైతులందరికీ ప్రయోజనం చేకూరింది.

శనగ రైతుకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి

ఆదుకున్న వైఎస్‌ జగన్‌...

2014 నుంచి 2019 మే నెల వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా చంద్రబాబు దగా చేయడంతో రైతులు దిగుబడులను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేసుకున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన శనగ రైతులకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి వైఎస్‌ జగన్‌ ఆదుకున్నారు. ఆ విధంగా జిల్లాలోని దాదాపు 35 వేల మంది శనగ రైతులకు ప్రయోజనం చేకూరింది. దానికితోడు 2020 నుంచి బహిరంగ మార్కెట్లో జేజే రకం శనగలకు దాదాపు క్వింటా రూ.8,000కు పైగా ధర పలికింది. కాగ్‌–2 రకానికి రూ.10,000 నుంచి రూ.11,000 వరకు ధర రావటంతో రైతులు ఎంతో సంతోషంగా పంట సాగు చేశారు. రాష్ట్రంలోని శనగ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు తగ్గించిన సుంకాన్ని పెంచాలని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా 50 నుంచి 60 శాతం వరకు సుంకాన్ని పెంచాలని కోరుతూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మద్దెల గురుమూర్తి తదితరులంతా కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు, పియూష్‌ గోయల్‌కు లేఖలు రాశారు.

విదేశాల నుంచి దిగుమతయ్యే శనగలకు కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. గతంలో ఉన్న 60 శాతం సుంకాన్ని ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వం 10 శాతానికి కుదించింది. ఫలితంగా స్థానికంగా పండే శనగలకు ధర ఇంకా దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. కనీసం పెట్టిన ఖర్చులు కూడా రావటం లేదని రైతులు వాపోతుంటే.. దిగుమతి సుంకాన్ని తగ్గించి రైతులను నిలువునా నడ్డి విరిచేసిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement