12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు

12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు

12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు నేడు ఏకేయూ డిగ్రీ మూడో సెమిస్టర్‌ మూల్యాంకనం లాటరీ ద్వారా మూడు బార్లకు లైసెన్స్‌లు జారీ సార్వత్రిక సమ్మెకు డీవైఎఫ్‌ఐ మద్దతు కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు

ఒంగోలు సిటీ: జిల్లాలో మార్చి 2026 లో జరగబోవు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులకు ఫీజు చెల్లింపు తేదీలను తత్కాల్‌ స్కీం ద్వారా పొడిగించినట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల అపరాధ రుసుం రూ.1000 లు చెల్లించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల నామినల్‌ రోల్స్‌, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని కోరారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సెమిస్టర్‌ మూల్యాంకనం ఈనెల 6వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుందని క్యాంప్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డీ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ కళ్యాణి మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్‌ల పేపర్లు వచ్చాయని, యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డులతో ఆయా సంబంధిత ప్రిన్సిపాల్‌ వద్ద నుంచి రిలీవింగ్‌ ఆర్డర్‌ కాపీలతో కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా కోరారు. మూల్యాంకనం తప్పనిసరి బాధ్యత కనుక సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ లను అధ్యాపకులను రిలీవ్‌ చేయాలన్నారు.

ఒంగోలు టౌన్‌: ఎట్టకేలకు మూడు బార్లకు లైసెన్సులు జారీ అయ్యాయి. ఒంగోలు కార్పొరేషన్‌ 1, మార్కాపురం 2 బార్లకు గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని డీఆర్‌ఓ చిన ఓబులేసు చాంబర్లో లాటరీ నిర్వహించారు. ఒంగోలు బార్‌కు నలుగురు, మార్కాపురంలోని రెండు బార్లకు 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి సమక్షంలో లాటరీ నిర్వహించినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ అయేషా బేగం తెలిపారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం బార్లకు లైసెన్స ప్రక్రియ ముగిసిందని చెప్పారు.

డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య

దర్శి: కార్మికుల సమస్యల కోసం ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, జాబ్‌ క్యాలెండర్‌ ని ప్రకటించాలని కోరుతూ ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు డీవైఎఫ్‌ఐ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో విద్యార్థి సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్‌, అక్బర్‌ ని కిడ్నాప్‌ చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీని బ్లాక్‌ లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ పిరా సాహెబ్‌, ఆర్‌ జెస్సిపాల్‌, నాయకులు కొండలు, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం: కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు పానుగంటి షాలేమ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు మందాటి పీటర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నేదరపల్లి జయరాజ్‌ అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు టీఎం రమేష్‌ మాదిగను దారుణంగా హత్యచేయడాన్ని ఖండిస్తూ గురువారం మార్కాపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, దళితులపై దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడిన రమేష్‌ను దారుణంగా హత్య చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్‌ కుటుంబానికి పరిహారం అందించి, 5 ఎకరాల భూమిని, కుటుంబంలో ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు గోన మొహన్‌, బూదాల ఆనంద్‌, భాస్కర్‌, గుర్రం రాణమ్మ, పి శీల, రాజు శ్రీధర్‌, మహేష్‌, సుధీర్‌, ప్రవీణ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement