అధికారుల తలా ఒకమాట... | - | Sakshi
Sakshi News home page

అధికారుల తలా ఒకమాట...

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

అధికా

అధికారుల తలా ఒకమాట...

కార్మిక నగర్‌లో పేదలు నివసిస్తున్న ఇళ్లను ప్రైవేటు వ్యక్తులు కూల్చివేయడం గురించి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మిక నగర్‌ ఇళ్ల సమస్య వివాదంలో ఉందని, ఇళ్ల కూల్చి వేత గురించి తమకేమీ తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. డయల్‌ 100కు ఫోన్‌ వస్తే పోలీసు సిబ్బంది వెళ్లారని, అక్కడ భూ వివాదం జరుగుతుండడంతో పోలీసులు వెనక్కి వచ్చారని తాలుకా సీఐ విజయకృష్ణ చెబుతున్నారు. జేసీబీలతో ఇళ్లు కూల్చిన విషయం తెలియదని, బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు ఘటనా స్థలంలో ఒక మహిళా ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారని బాధితులు చెబుతుండడం గమనార్హం. రెండు మూడు రోజుల ముందే ఒక పోలీసు జీపు కార్మిక నగర్లోకి వచ్చి పోయిందని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేకపోయామని బాధితులు వాపోతున్నారు.

అధికారుల తలా ఒకమాట... 
1
1/1

అధికారుల తలా ఒకమాట...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement