గుండె జబ్బుతో బాధపడుతున్నాం..ఇప్పుడేం చేయాలో..
నా పేరు సైకం ఏసులీల. భర్త పేరు కృష్ణ. మాకు నలుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయిపోయాయి. మేము ఇద్దరమే కాలనీలో నివసిస్తున్నాం. ఇద్దరికీ గుండె జబ్బు.. రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తింటున్నాం. మా ఆయనకు పెన్షన్ వస్తుంది. దాంతో మందులు తెచ్చుకొని బతుకుతున్నాం. మమ్మల్ని చూసేవారులేరు. ఉన్న ఇల్లు కూడా అన్యాయంగా కూల్చేశారు. ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. గత ఎన్నికల్లో కూటమికి ఓటేశాం. న్యాయం సంగతి దేవుడెరుగు ఇల్లు లేకుండా దగా చేశారు. ఇప్పటికై నా మాకు కార్మిక నగర్‌లో పట్టాలు ఇవ్వాలి. పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. – సైకం ఏసులీల


