ఆర్మీ అధికారి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

ఆర్మీ

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య

కంభం:

ండ్రి చనిపోయి రెండు నెలలు గడవక ముందే కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటన మండలంలోని తురిమెళ్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన యేలం వెంకటరమణ(49) 30 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లెఫ్టనెంట్‌గా పదోన్నతి పొంది అసోం రాష్ట్రం దిబ్రూగఢ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించే క్రమంలో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు వైద్యశాలలో చేర్పించగా..అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మరో నెల రోజుల్లో వెంకటరమణ రిటైర్డ్‌ అయి ఇంటికి రావాల్సి ఉండగా ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గురువారం ఆర్మీ అధికారి మృతదేహాన్ని తురిమెళ్లకు తీసుకురాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల వెంకట రమణ తండ్రి వేమయ్య మరణించడంతో ఆయన దిశదిన కార్యక్రమాలు నిర్వహించే ఇటీవలే తిరిగి వెళ్లారు. అంతలోనే అంతలోనే తనువు చాలించడంతో గ్రామంలో సైతం విషాదచాయలు అలుముకున్నాయి. ఆర్మీ మేజర్‌ ఎస్‌పీ సింగ్‌, నాయక్‌ సుబేదార్‌లు గోపాల్‌రెడ్డి, గంగాసింగ్‌, హవాల్దార్‌ కేపీ గౌడ్‌ ప్రేరేడ్‌ నిర్వహించి అధికార లాంఛనలాతో అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు జాతీయ జెండా అందజేశారు. తహసీల్దార్‌ వి. కిరణ్‌కుమార్‌, కంభం ఎస్సై శివక్రిష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు వేణుగోపాల్‌, సంకతాల ప్రసాద్‌, పుల్లయ్య, పోలయ్య, శ్రీనివాసులు, తదితరులు మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మృతి చెందిన

వెంకటరమణ (ఫైల్‌)

మరో నెలరోజుల్లో రిటైర్డ్‌ కానున్న

వెంకటరమణ

అంతలోనే ఇలా జరగడంతో

కుటుంబంలో విషాదం

తండ్రి చనిపోయి రెండు నెలలు

గడవకముందే కుమారుడు మృతి

తురిమెళ్ల గ్రామంలో విషాదచాయలు

ఆర్మీ అధికారి అంత్యక్రియలు 1
1/4

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

ఆర్మీ అధికారి అంత్యక్రియలు 2
2/4

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

ఆర్మీ అధికారి అంత్యక్రియలు 3
3/4

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

ఆర్మీ అధికారి అంత్యక్రియలు 4
4/4

ఆర్మీ అధికారి అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement