పోరు బాట | - | Sakshi
Sakshi News home page

పోరు బాట

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

పోరు

పోరు బాట

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

నంద్యాల జిల్లా నందికొట్కూరు వద్ద ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నఅన్యాయానికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌తో పాటు పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు

మార్కాపురం టౌన్‌: మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకానికి వచ్చే భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా త్రిపురాంతకం ఆలయం వద్ద తీసుకోవాల్సిన ఏర్పాట్లపై గురువారం ఆయన రెవెన్యూ, పోలీసు, దేవదాయశాఖ, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీరకాల వసతులు కల్పించాలని జేసీ సూచించారు. దేవస్థాన ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు అందించాలని, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, తొక్కిసలాట జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పానకాలరావు మాట్లాడుతూ త్రిపురాంతకేశ్వరస్వామి రథోత్సవానికి సుమారు 45 నుంచి 50 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయని, భక్తుల సౌకర్యార్థం రూ.10, రూ.100, రూ.250 టిక్కెట్లను ప్రవేశపెడుతున్నామన్నారు. భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోరు బాట 1
1/1

పోరు బాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement