నష్టాలతో కునారిల్లుతున్న శనగ రైతు
జిల్లాలో శనగ పండిస్తున్న రైతులు నష్టాలతో కునారిల్లుతున్నారు. గత సంవత్సరం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని ఉన్నారు. క్వింటా శనగలకు కనీసం రూ.5 వేలు కూడా రావటం లేదు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోగా, తగ్గిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. శనగ రైతులను ఆదుకుందామన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు.
– మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
శనగలపై దిగుమతి సుంకం పెంచేందుకు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దేశీయ శనగ రైతులను ఆదుకోవాలి. గతంలో ఉన్న మాదిరిగా 50 శాతం, 60 శాతం దిగుమతి సుంకాలు అమలు చేస్తేనే దేశీయ శనగ రైతులు అప్పుల ఊభి నుంచి బయట పడతారు. లేకుంటే కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలు కూడా రైతులకు దక్కకుండా పోయే పరిస్థితులు ఎదురవుతాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో పండించిన శనగ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– దుగ్గినేని గోపీనాథ్,
రైతు సంఘ జిల్లా
అధ్యక్షుడు
నష్టాలతో కునారిల్లుతున్న శనగ రైతు
నష్టాలతో కునారిల్లుతున్న శనగ రైతు
నష్టాలతో కునారిల్లుతున్న శనగ రైతు


