గోరుముద్దను కాలదన్నారు! | - | Sakshi
Sakshi News home page

గోరుముద్దను కాలదన్నారు!

Feb 11 2026 8:43 AM | Updated on Feb 11 2026 8:43 AM

గోరుమ

గోరుముద్దను కాలదన్నారు!

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి తనిఖీలో వెలుగులోకి వాస్తవాలు

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి తనిఖీలో వెలుగులోకి వాస్తవాలు

సింగరాయకొండ/సంతనూతలపాడు

(చీమకుర్తి రూరల్‌)/ఉలవపాడు:

విద్యార్థుల సంక్షేమంపై చంద్రబాబు సర్కారు ఉదాసీన వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపణలు రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ తనిఖీలతో వాస్తవమేనని నిరూపితమయ్యాయి. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు ఇండేల లక్ష్మీరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. సింగరాయకొండలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో పుచ్చిపోయిన వేరుశనగలు, పురుగు పట్టిన కందిపప్పు, నాసిరకంగా ఉన్న శనగలను చూసి శ్ఙ్రీపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడతారాశ్రీశ్రీ అంటూ ప్రిన్సిపాల్‌ రమాదేవితోపాటు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో 800 మంది బాలికలు ఉండగా వారికి సరిపడా ఆహారం వండకపోవడం, మెనూ పాటించకపోవడాన్ని గమనించి కేర్‌టేకర్‌ను ప్రశ్నించారు. ఉదయం బగారా రైస్‌, చికెన్‌ పెట్టాల్సి ఉండగా కేవలం సాధారణ రైస్‌, చికెన్‌ పెట్టారని, మెనూ పాటించటం లేదని బాలికలు చెప్పడంతో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. స్టాక్‌ రిజిస్టర్‌ సక్రమంగా లేకపోవడం, పిల్లలకు ఆహారం సరిపడినంత ఇవ్వకపోవడంపై జేసీ కల్పనాకుమారికి తెలియజేశానని పేర్కొన్నారు.

అంగన్‌వాడీల తీరుపై ఆగ్రహం

సంతనూతనలపాడు మండలంలోని పి.గుడిపాడు 1, 2 అంగన్‌వాడీ కేంద్రాలను పుడ్‌ కమిషన్‌ సభ్యుడు తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకే చిన్నారులను తీసుకురావాల్సి ఉండగా 10.30 గంటల వరకు ఎందుకు తేలేదని అంగన్‌వాడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు పంపిణీ చేయకపోవడం, రిజస్టర్లు అస్తవ్యస్తంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్‌వైజర్‌ సావిత్రికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. పి.గుడిపాడు 2వ అంగన్‌వాడీ కేంద్రంలో హాజరు పట్టిక తప్పులతడకగా ఉండటం, పరిసరాల అపరిశుభ్రతను గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఆహారం వండకుండా ఇంటి దగ్గర వంట చేయడంపై ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. ఇకపై పాఠశాలలోనే వంట వండి ఫొటోలు తీసి తనకు పంపాలని ఆదేశించారు. చీమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం మూత వేయడం, ఎస్సీ కాలనీలో కేంద్రానికి పిల్లలను తేకపోవడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిలల్లకు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం లేకపోవడాన్ని గమనించి, చర్యలకు సిఫార్సు చేశారు. ఆయన వెంట సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ లక్ష్మానాయక్‌, డీఎస్‌ఓ పద్మశ్రీ, సివిల్‌ సప్లయ్‌ డీఎం వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితరులు ఉన్నారు.

జిల్లాలోని పలు అంగన్‌వాడీలు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూకు మంగళం

కడుపు నిండా అన్నం పెట్టడం లేదని విద్యార్థుల ఆవేదన

సింగరాయకొండ గురుకులంలో పుచ్చిపోయిన పల్లీలు.. పురుగుల కందిపప్పు

చీమకుర్తి మండల అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం నిల్‌

ఉలవపాడు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ఆకలి కేకలు

గోరుముద్దను కాలదన్నారు!1
1/1

గోరుముద్దను కాలదన్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement