తాళ్లూరు:
2029 ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్యెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా గురువారం రాత్రి తూర్పుగంగవరం పడమటి బజార్ బూచేపల్లి యూత్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బూచేపల్లి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా కరోనాలో రెండేళ్లు ఇబ్బందులు ఉన్నా నవరత్నాలను 100 శాతం అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్‌లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలు, రైతులు జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సి బాధ్యత మనదేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్‌రెడ్డి, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, జిల్లా లీగల్‌సెల్ కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ కల్చరల్ విభాగం అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, నియోజకవర్గ ప్రచారం విభాగం అధ్యక్షుడు యత్తపు మధుసూదన్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, రైతు అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజ్జుల వెంకటేశ్వర్లురెడ్డి (గోల్డ్), గొల్లపూడి యర్రయ్య, గువ్వల సత్యనారాయణరెడ్డి, సోషల్ మీడియా నాయకులు కొనికి గోవిందరాజు యాదవ్, బొజ్జా సంజీవ్‌కుమార్, సర్పంచ్ షేక్ వలి, పార్టీ నాయకులు గూడా శ్రీధర్‌రెడ్డి, గూడా ప్రసాద్‌రెడ్డి, ఎడమకంటి రాజాగోపాల్‌రెడ్డి (గోపి), కై పు వెంకట కృష్ణారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, ఐ.విజయభాస్కర్‌రెడ్డి (పాదయాత్ర), గుద్దేటి శ్రీనివాసరెడ్డి (జగన్), గువ్వల తిరుపతి (రాయుడు), పడమట బజార్ యాత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి


