చీమకుర్తి: మండలంలోని మర్రిచెట్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో చిన్న స్థలంలో రేకులతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేశారని దాసరి రాజేశ్వరి, ఆమె భర్త దాసరి రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిర్మించుకున్న ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వేకువ జామున కూల్చేశారని, వారు గతంలో తమ ఇంటిపైకి దాడికి కూడా దిగారని ఈ సందర్భంగా పోలీసులకు బాధితులు గుర్తు చేశారు. సర్వే నెంబర్ 195లో 2 సెంట్ల భూమిని గతంలో రవి నాన్న దాసరి నాగేశ్వరరావు పేరు మీద ఉంది. దానిలో ఇంటిని నిర్మించుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారని భయాందోళనతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ఒకసారి ఇదే విషయంపై రవి ఇంటిపైకి వచ్చిన వారిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టినా లేక బైండోవర్ చేసినా ఇప్పుడు తన ఇంటిని ఎవరూ కాల్చే వారు కాదని గుర్తు చేశారు. అంతే కాకుండా ఈ విషయం అడిగినందుకు తనపై దాడి చేసిన వారు ఫిర్యాదు చేయటంతో తనపైనే కేసు నమోదు చేస్తున్నారని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పోలీస్‌స్టేషన్‌లో సీఐని అడిగినందుకు తనను తన భార్య, ఎస్సై, ఇతర వ్యక్తుల ముందే చొక్కా పట్టుకొని సీఐ లోపలకు లాక్కెళ్లాడని, ఆయనపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఎస్సైకి దాసరి రవి ఫిర్యాదు చేశారు. దానిపై సీఐని వివరణ కోరగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రవి న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పారు.
ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడి చొక్కా పట్టుకున్న సీఐ
సీఐపై ఎస్సైకి ఫిర్యాదు


