ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్‌ కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్‌ కృషి

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్‌ కృషి విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

ఒంగోలు సబర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీఎన్‌జీజీఓ అసోసియేషన్‌ కృషి చేస్తుందని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు అన్నారు. స్థానిక ఎన్‌జీఓ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిల విడుదల వేగవంతం చేయాలని కోరారు. పే రివిజన్‌ కమిషన్‌ను వెంటనే నియమించి ఇంటేరియం రిలీఫ్‌ మంజూరు చేయాలని, అదే విధంగా పెండింగ్‌ డీఏలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ నిరంతర కృషి ఫలితమని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలన్నీ సాధించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. సంక్షేమం కోసం అసోసియేషన్‌ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని, పీఆర్‌సీ కమిటీ నియామకం, సరెండర్‌ లీవ్‌కు సంబంధించిన బిల్లులు సహా ఇతర పెండింగ్‌ బిల్లుల త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కే శివ కుమార్‌, సహాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ పి.మాధవి, ఉపాధ్యక్షులు బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పీ రామాంజనేయులు, ఆర్‌ దీపక్‌ కుమార్‌, బీ విజయ్‌ కుమార్‌, కే కోటేశ్వరమ్మ, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి బీ కృష్ణ కిషోర్‌, జిల్లా సంయుక్త కార్యదర్శులు యం శ్రీనివాసరావు, డీ వెంకటేశ్వర్లు, డీ మధుసూదన రెడ్డి, కే రాజేష్‌ బాబు, వీ హరి బాబు, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్‌, కార్యదర్శి షేక్‌ మగ్దుం షరీఫ్‌, జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.

దేహశుద్ధి చేసిన బంధువులు

కురిచేడు: పదో తరగతి పరీక్షల చివరి రోజు ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం పదో తరగతి పరీక్షలు ముగియడంతో స్థానిక వైఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువులకు ఒకసారి కనిపించి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ విద్యార్థిని పీఎస్‌ ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లగా అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసి ఆ విద్యార్థిని బంధువులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కాలనాగులై కాటేస్తుంటే ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు రక్షణ కరువైంది. కంచె చేను మేసిన చందంగా ఉపాధ్యాయులు తయారవుతున్నారు. మండలంలో ఏడాదిన్నరలో నాలుగు పాఠశాలల్లో విద్యార్థినులతో ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిద్రావస్థను వీడి కీచక గురువులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement