సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 2 2026 7:19 AM | Updated on Feb 2 2026 7:19 AM

సోమవా

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 – IIలో..

న్యూస్‌రీల్‌

కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి కూటమి ప్రభుత్వం ఉన్నా ఉపయోగం సున్నా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు నిల్‌ పొగాకు, మిర్చి రైతులకు మద్దతు ధరల ప్రస్తావనే లేదు కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల మండిపాటు

ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌ జిల్లా ప్రజల ఆశలను అడియాసలు చేసింది. గత బడ్జెట్లో జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించి రూ.50 కోట్లు ప్రకటించినా ఆ నిధులు వచ్చాయో లేదో తెలియకుండానే ఆర్ధిక సంవత్సరం గడిచిపోయింది. ఈ ఏడాది బడ్జెట్లో దాని ఊసే లేకుండా చేశారు. దశాబ్దాలుగా ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కేవలం బోర్డులకు పరిమితమైంది. జిల్లా వెనకబాటును గుర్తించిన కేంద్రం ఆ దామాషాలో నిధులు కేటాయించపోవడం దారుణం. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి.

– ఎస్‌కే మాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి

కరువు జిల్లా ప్రస్తావనే లేదు

కేంద్ర బడ్జెట్లో జిల్లాకు మరోసారి మొండిచేయి చూపారు. తరచుగా కరువుబారిన పడే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కరువు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాకు ప్రధాన ఆదాయవనరులైన మిర్చి, పొగాకు రైతులకు మద్దతు ధరలకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వలేదు.

– చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి

నిత్యం కరువు కాటకాలతో అల్లాడే జిల్లాకు కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండిచేయే మిగిలింది. వెనకబడిన జిల్లాల ప్రస్తావన లేకుండానే నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. ప్రజల మౌలిక అవసరాలు, జీవనోపాధిని పట్టించుకోకుండా అంకెల గారడీతో మురిపించే ప్రయత్నాలు చేసినట్లు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తోందని, కనీసం కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొని రాలేకపోతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక, రేషన్‌ వ్యవహారాలతో తలమునకలవుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పద్దు పొడవని ఆశలు

ఒంగోలు టౌన్‌:

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026–27తో కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు మినహా ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరువు జిల్లాగా పేరొందిన ప్రకాశం జిల్లా ఇప్పుడు రెండుగా విభజన చెందింది. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. మరింతగా వెనకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకపోవడంతో జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా తరచుగా కరువుబారిన పడుతుంది. గత బడ్జెట్లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లే కనిపించింది. అందుకే వెనకబడిన జిల్లాగా ప్రకటించడమే కాకుండా రూ.50 కోట్లు కేటాయించింది. అయితే ఆ నిధులు వచ్చాయో లేదో తెలియని పరిస్థితి. వస్తే ఆ నిధులతో ఏఏ పనులు చేశారో కూడా తెలియకుండా పోయిందని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. తాజా బడ్జెట్లో మరింత నిధులు కేటాయిస్తారేమోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అసలు ఆ ప్రస్తావనే లేకుండా పోయింది. జిల్లాలో కరువును తరమి కొట్టాలంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఒక్కటే పరిష్కారం. అయితే గుండ్లకమ్మ, వెలిగొండ ప్రాజెక్టులతో పాటుగా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయించలేదు. జిల్లా రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా పొగాకు, మిర్చి పంటలున్నాయి. ఈ ఏడాది పొగాకు, మిర్చి, శనగ పంటలకు గిట్టుబాటు లేక రైతులు రోడ్డెక్కారు. పొగాకు రైతులైతే రోజుల తరబడి బోర్డు ఎదుట కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా కొనేనాథుడు లేక అల్లాడిపోయారు. ఈ బడ్జెట్లో పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధరల గురించి ప్రస్తావించలేదు. శనగ రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ప్రకటించలేదు. దీంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురయ్యారు. రామాయపట్నం పోర్టు, ట్రిపుల్‌ ఐటీ, మార్కాపురం మెడికల్‌ కాలేజీ, ఆంధ్ర కేసరి యూనివర్శిటీ అభివృద్ధికి తగిన నిధులు తీసుకొని రావడంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీలు విఫలమయ్యారని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో గతంలో ఉద్యమాలు కూడా జరిగాయి. అయినా ఈ విషయాన్ని జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి 25 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. పన్ను రాయితీ కోసం వారంతా ఆశగా ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదని ప్రజా సంఘాలు పెదవి విరుస్తున్నారు.

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement