గంగమ్మ తల్లి దేవాలయంలో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ
రామతీర్థంలో మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ
చీమకుర్తి రూరల్:
గ్రానైట్ ఖిల్లా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచిన రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల బుధవారం రాత్రి రంగరంగ వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు హాజరై గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి శరణు వేడారు. చీమకుర్తి మండలం రామతీర్థం నిధిలో వెలసిన గంగా, బాలత్రిపురసుందరీ సమేత మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు మొక్కులు చెల్లించారు. తిరునాళ్ల సందర్భంగా మోక్షరామలింగేశ్వరస్వామి దేవస్థానం, గంగమ్మ తల్లి ఆలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఐదు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, తిరునాళ్లకు హాజరైన భక్తులకు వివిధ సామాజిక సత్రాల్లో అన్న సంతర్పణ చేశారు. చీమకుర్తి సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
రామతీర్థంలో బూచేపల్లి ప్రత్యేక పూజలు
మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, గంగమ్మ తల్లి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేయించారు. రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల బాగా జరగాలని, ముందుగా మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో తరువాత గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ
చీమకుర్తిలో యువకుని హత్య?
ఉలవపాడులో చోరీ
● 8 సవర్ల బంగారం అపహరణ
ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడు రిజర్వు కాలనీలోని రెండో లైనులో ఓ ఇంట్లో చోరీ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. షేక్ షాహిద్‌కు రిజర్వు కాలనీ రెండో లైన్ లో సొంత గృహం ఉంది. కొంత కాలంగా సికింద్రాబాద్ లో ఉద్యోగ నిమిత్తం నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కింద పోర్షన్ అద్దెకి ఇచ్చి పైన ఇక్కడకు వచ్చినప్పుడు నివాసం ఉంటారు. 45 రోజుల క్రితం ఉలవపాడుకు వచ్చి తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లాడు. మంగళవారం రాత్రి కింద పోర్షన్ లో అద్దెకు ఉండేవారు గమనించి పైన దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. బుధవారం వచ్చి పరిశీలించగా బీరువా పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్‌బాషా, ఎస్సై సుబ్బారావు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బీరువాలో ఉన్న 8 సవర్ల బంగారు నగలు చోరీకి గురయ్యాయని బాధితుడు తెలిపారు. క్లూస్ టీమ్‌వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీమకుర్తి: చీమకుర్తిలో మంగళవారం రాత్రి మందిరాల వేడుకలో పాల్గొని ఇంటికి చేరుకున్న యువకుడు తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. చెవి నుంచి రక్తం కారిన మరకలు, కనుబొమ్మలు, మెడపై రక్తపు గాట్లు, గుండెలపై కమిలిన మచ్చలు ఉండటంతో యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం మృతుడి భార్య కార్తికేయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం, అందిన సమాచారం మేరకు.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన రామయోగి పెయింట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా చీమకుర్తిలోని గాంధీనగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని భార్య కార్తికేయి, రెండేళ్ల కుమారుడు యోగేష్‌తో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి చీమకుర్తిలో మందిరాల సంబరాలకు భార్య, కుమారుడితో కలిసి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. మరో గంట తర్వాత రామయోగిని తనతోపాటు పనిచేసే ముగ్గురు స్నేహితులు వచ్చి మందిరాల సంబరాల పేరుతో వెంట తీసుకెళ్లారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య ముగ్గురు స్నేహితులు రామయోగిని ఇంటి వద్ద వదిలి వెళ్లారు.
మృతుడి భార్య కథనం ప్రకారం.. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న రామయోగి తన భార్యతో రెండు మూడు మాటలు మాట్లాడి తొలుత మంచంపై, కాసేపటి తర్వాత నేలపై పడుకున్నాడు. బుధవారం ఉదయం ఇంటి పనులు చేసుకుంటూ భర్తను నిద్ర లేపే ప్రయత్నం చేయగా ఎలాంటి కదలిక లేదు. భర్త మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ దాసరి ప్రసాదరావు, ఎస్సై పీవీ కృష్ణయ్య పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానంతో కార్తికేయితోపాటు మృతుడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి సోదరుడు యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీవీ కృష్ణయ్య తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
రామయోగి చెవి వద్ద రక్తపు
మరకలు, మెడపై గాయం
మృతదేహం వద్ద విలపిస్తున్న సోదరుడు
యోగేశ్వరరావు
12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సిందే..
రామతీర్థం నిధిలో వైభవంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల
మోక్షరామలింగేశ్వరస్వామి ఆలయంలో వేలాది భక్తుల పూజలు
ఐదు విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు
మృతుడు పెయింటింగ్ వర్కర్
రాత్రి ఇంటికి వచ్చి పడుకుని, తెల్లవారేసరికి శవమైన వైనం
శరీరంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మృతుడి భార్యతోపాటు ముగ్గురు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు


