న్యూస్‌రీల్
పశ్చిమాసియా యుద్ధం వంటింట్లో మంటలు రేపుతోంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలు సగటు జీవిని గాయపరుస్తున్నాయి. తొలుత గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ధరల పెరుగుదలకు శ్రీకారం చుట్టినట్లయింది. గ్యాస్ ధరలు పెరగడంతో పాలు, పెరుగు, సిమెంట్, వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ కోసం ఏజెన్సీల దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. పాల కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నాడు. వంటనూనె కోసం చేతులు కాల్చుకుంటున్నాడు. అయినా సరే పాలకులకు పట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తుంటే ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదని జనం ఆందోళన చెందుతున్నారు.


