● గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారం
కనిగిరిరూరల్: మండలంలోని గుడిపాడు కొత్తపాలెంలో వింత ఆచారంతో వివాహం జరిగింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆ గ్రామంలోని 7 గోత్రాలు, సుమారు 5 ఇంటి పేర్ల కుటుంబాలకు చెందిన వారి వివాహ వేడుకల్లో వరుడు వధువుగా అలంకరించుకోవడం ఆచారం. ఈక్రమంలో గుడిపాడు కొత్తపాలెంలో దాదిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీదేవిల వివాహం బుధవారం జరిగింది. వివాహంలో వారి ఆచారం ప్రకారం ముందుగా పెళ్లి కుమారుడు కృష్ణారెడ్డి పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. ఊరేగింపుగా ఎదురు నడిచే కార్యక్రమం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది


