నంది విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు
● గుప్తనిధుల కోసమేనని అనుమానాలు
కంభం: స్థానిక కంభం చెరువుకు వెళ్లే దారిలో ఓ పంట పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తవ్వకాలు జరిపిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో తవ్వకాలు జరిపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.
ఒంగోలు టౌన్: ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి భారీగా గంజాయి లభ్యమైంది. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. గంజాయి కట్టడిలో భాగంగా శనివారం ఒంగోలు నుంచి కావలి వరకు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా అంబాదర్ గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌బాగ్, తమిళనాడులోని రాణిపేట జిల్లా వన్నియ మొట్టూరు గ్రామానికి చెందిన వి.జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఎస్సైలు సుదర్శన్, శ్రీరాం, చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, ఈగిల్ టీం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
పుల్లలచెరువు: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి స్థానిక హైదరాబాద్ రహదారిపై జరిగింది. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెం గ్రామానికి చెందిన నాగుల అమరలింగయ్య (39) అనే రైతు పనిపై పల్నాడు జిల్లా దావపల్లి వెళ్లి తిరిగి మల్లాపాలెం వస్తున్నాడు. అతివేగం కారణంగా కల్వర్టును ఢీకొని సుమారు 20 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు గాలించగా, బైకును గుర్తించి చుట్టుపక్కల చూడగా, లింగయ్య మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ సంపత్‌కుమార్ తెలిపారు.
నంది విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు
నంది విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు


