శంకరరెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

శంకరరెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ

Feb 1 2026 3:09 AM | Updated on Feb 1 2026 3:09 AM

శంకరరెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ

శంకరరెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ

ఉలవపాడు: అనారోగ్యంతో మరణించిన పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరరెడ్డి కుటుంబ సభ్యులను మండల పరిధిలోని బద్దిపూడి గ్రామంలోని వారి స్వగృహంలో రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌లు మాదాసి వెంకయ్య, వైఎం మారుతీ ప్రసాద్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులు రఫీ, గంగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement