కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు | - | Sakshi
Sakshi News home page

కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు

Feb 1 2026 3:09 AM | Updated on Feb 1 2026 3:09 AM

కక్షప

కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు

రాజకీయాల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు తిరుపతి లడ్డులో జంతుకొవ్వు కలిసిందని అసత్య ప్రచారం సీబీఐ స్టేట్‌మెంట్‌ వచ్చాక చంద్రబాబు, పవన్‌ ఎక్కడ దాక్కున్నారు సోషల్‌ మీడియాలు, ఫ్లెక్సీలతో అబద్ధపు ప్రచారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపాటు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాపపరిహార పూజలు

101 టెంకాయలు కొడుతున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

దర్శి: చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెప్పి వాటిని నిజాలు చేయాలనే విషప్రచారాలు మానుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి హితవు పలికారు. పొదిలి రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాపపరిహార పూజలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులు భారీగా తరలి వచ్చారు. శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మలు ఆలయంలో పూజలు నిర్వహించి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. బూచేపల్లికి పూర్ణకుంభంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం బయట వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ హిందువులు దైవంగా పూజించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డులో పంది కొవ్వు, చేపకొవ్వు, జంతువుల కొవ్వు కలసిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అసత్య విషప్రచారం చేసి అభాసుపాలయ్యారన్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుపతి లడ్డును కూడా వదల లేదని మండిపడ్డారు. సనాతన ధర్మం అని చెప్పుకుంటూ మడి కట్టి, రకరకాల వేషాలు వేసే పవన్‌ కళ్యాణ్‌ సీబీఐ, ఎన్‌డీఆర్‌ఐ స్టేట్‌మెంట్‌ వచ్చిన తరువాత అడ్రస్‌ లేకుండా పారి పోయారన్నారు. వీళ్లు స్వార్థం కోసం సోషల్‌ మీడియాల ద్వారా, ఫ్లెక్సీలు వేసి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా తప్పుడు ప్రకటనలు మానుకుని, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చి విజయవాడలో గుడులన్నీ కూల్చి వేసిన సంగతి గుర్తు చేశారు. ఆయన గుళ్లు కూల్చి వేస్తే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి కూల్చిన గుడుల స్థానంలో కొత్త గుడులు నిర్మాణాలు చేశారని గుర్తు చేశారు. అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరుగుతుంటే ఆ విషయంపై బాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్‌ లేకుండా చేస్తే ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పటికై నా డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకుని నిజాయతీగా పాలన చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నా బత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు పోశం మధు, సంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్‌, ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి షేక్‌ సైదా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్‌భాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, జెడ్పీటీసీలు నుసుం వెంకటనాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, కౌన్సిలర్లు మేడం మోహన్‌రెడ్డి, ఆవుల జ్యోతి శివారెడ్డి, తుళ్ళూరి బాబురావు, జగన్నాథం మోహన్‌బాబు, వార్డు ఇంచార్జ్‌లు చెరుకూరి జగన్‌, అన్నవరపు రవి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, నాయకులు కోరె సుబ్బారావు, పానుగంటి మోహన్‌రావు, కొరివి కోటయ్య, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, కుంటా అచ్చారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు1
1/1

కక్షపూరిత విషప్రచారాలు మానుకో బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement