4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక | - | Sakshi
Sakshi News home page

4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక

Feb 1 2026 3:09 AM | Updated on Feb 1 2026 3:09 AM

4న ఒం

4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక

4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక అద్దంకి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి అవార్డు

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈనెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆ రోజు ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరిన కమిటీ 11 గంటలకు ఒంగోలు చేరుకుంటారన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. 2019–20, 20202–21, 2021–22 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌ అంచనాలపై సమీక్షిస్తారన్నారు.

అద్దంకి: మాస్టర్‌ ఆఫ్‌ ఫ్రేం అకాడమీ ఆధ్వర్యంలో ఐ మార్కు జగన్‌ సారథ్యంలో మోతుగూడెంలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌లో మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన యోగికి బెస్ట్‌ ఇమేజ్‌ అవార్డు లభించింది. మూడు రోజుల పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో ఫ్యాకల్టీగా బీకే అగర్వార్‌ వర్క్‌ షాపు నిర్వహించారు. ఈ పోటీల్లో యోగీ తీసిన భద్రకాళి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోకు బెస్ట్‌ ఇమేజ్‌ అవార్డు లభించింది. యోగికి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఎస్‌కే ఏ షరీఫ్‌ మెమోరియల్‌ అవార్డును అందజేశారు.

4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక 1
1/1

4న ఒంగోలుకు శాసన సభ అంచనాల కమిటీ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement