చాలీచాలని భోజనం.. రోజూ అల్లాడుతున్నాం
● కందుకూరు ఎమ్మెల్యేకు
చేదు అనుభవం
ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఐఎస్‌ఎఫ్ ర్యాలీకి హాజరైన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలలో చదువుకుంటూ ఉలవపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎమ్మెల్యేతో తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. శ్రీమాకు అన్నం సరిగా పెట్టడం లేదు, చాలీచాలని భోజనంతో రోజూ విలవిల్లాడుతున్నాం. మీరు ఒకసారి మాట్లాడండిశ్రీ అంటూ వేడుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో హాస్టల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే మెనూ ఎందుకు అమలు చేయడం లేదంటూ వార్డెన్, వంట మనిషిని ప్రశ్నించారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని, పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి వెనుదిరిగారు.


